ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలో గాంధీనగర్‌ కాలనీకి చెందిన షేక్‌ బాబు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి మంజూరైన రూ. 2 లక్షలు బిఆర్‌ఎస్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ చెక్కును వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడి కుటుంబానికి ‘నేనున్నా’నంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసాగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. దీనివల్ల ఆ కుటుంబాలకు ఎంతో కొంత పార్టీ ద్వారా ఆర్థికసాయం అందుతుందని, అంతేగాక ఇలాంటి పథకాలు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అమలు కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు.

వీటితోపాటు రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతున్నాయి అని అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ రాష్ట్రంలో ప్రజల ముంగిటకు తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని, బిఆర్‌ఎస్‌ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »