మోర్తాడ్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ దయ వల్ల బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేశామో..అదే ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ స్విచ్ ఆన్ చేసి వెలుగులు ప్రసరింప చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వారికి ఇది ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కేసిఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే నేడు మోర్తాడ్‌ను అన్ని విధాల అభివృద్ది చేసుకోగలుగుతున్నమని అన్నారు.
రోడ్లు, బ్రిడ్జిలు, 24గంటల కరెంట్, రైతు బంధు, ఎండాకాలంలో కూడా అలుగులు పారే చెరువులు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. 50 ఏళ్లలో జరిగిన అబివృద్దికి నాలుగింతలు ఈ 8ఏళ్లలో జరిగిందన్నారు. సుమారు 13 కోట్ల వ్యయంతో మోర్తాడ్ మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నమన్నారు. మంచి చెడులపై ఆలోచన చేసేగుణం ఒక్క మనిషికి మాత్రమే ఉన్నదని ప్రజలు అటువైపుగా ఆలోచన చేయాలని కోరారు. ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు. ఎవరు మాటలు చేస్తున్నారు గమనించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.