నిజామాబాద్, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కి, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. సెర్ప్ ఉద్యోగస్తుల చిరకాల కల నెరవేరిందని, 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి జీవో నెంబర్ 11 ప్రకారం పే స్కేల్ మంజూరు చేసినందుకు, క్రమబద్ధీకరించినందుకు సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారన్నారు. మంచి వేతనం అందించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు సెర్ప్ ఉద్యోగులు రుణపడి ఉంటారని ఆయన అన్నారు.
20 ఏండ్లుగా సెర్ప్‌లో ఉద్యోగం చేస్తు. 2,150 జీతంతో ఉద్యోగంలో చేరిన వారికి సీఎం కేసీఆర్ చొరవతో 25వేల వరకు వస్తుందని, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, వారితో వెట్టి చాకిరి చేయించుకున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సెర్ప్ బతుకుల్లో వెలుగులు నింపిండని, ఇక ప్రభుత్వోద్యోగులతో సమానంతో వేతనాలు అందుతాయని, రాష్ట్రంలో 3974 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ కల్పించడం చాలా ఆనందంగా ఉందని, మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరిందని, రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడిరదని, గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజీ గంగాధర్ గౌడ్, జిల్లా యువ నాయకుడు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్, సెర్ప్ ఉద్యోగులు, ఐకేపీ మహిళా సంఘాల నాయకురాలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.