బాన్సువాడ, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాలు జరగకుండా సైబర్ మోసగాల వలలో పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులకు ఎంతో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ స్వీకరించకుండా, తమకు ఏమైనా అనుమానం వస్తే వారి నెంబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని, కావున సైబర్ నేరగాళ్ల మోసంలో పడి డబ్బును పోగొట్టుకోవద్దని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఇంటివద్ద అవగాహన కల్పించి వారిని చైతన్య పరచాలనీ సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్, కానిస్టేబుల్ మురళి, ఉపాధ్యాయ బృందం, అశోక్, భూమయ్య, దత్తు గౌడ్, శేఖర్, గంగాధర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.