కామారెడ్డి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్ధరికి ఎల్వోసి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గాడి లక్ష్మికి 2 లక్షల 50 వేల రూపాయలు, మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు మంజులకు రెండు లక్షల రూపాయల ఎల్వోసి చెక్కును అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, సీనియర్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.