రామారెడ్డి, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీ సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, పాడి పంటలతో, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రాంతంలోని అన్ని దేవాలయాలను ముఖ్యంగా ఇలాంటి ప్రాచీనమైన చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలను వెలికితీస్తూ వాటి అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆధ్యాత్మికతతో కనివిని ఎరుగని విధంగా మహా చండీయాగం లోక కళ్యాణం కోసం చేసిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే అన్నారు.
యాదాద్రి నరసింహ స్వామి దేవాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయముగా తీర్చి దిద్దుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి శ్యామ్, రజిత రాజేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ ఉప్పల్‌వాయి నారాయణ రెడ్డి, ఆలయం కమిటీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ సంజీవ్, ఉప సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.