నిజామాబాద్, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చ్ 31వ తేదీ శుక్రవారం నుండి నిజామాబాదులో ప్రారంభమవుతున్న మొదటి స్పెల్ ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకన విధుల ఆర్డర్ కాపీలు వచ్చిన నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలోని ప్రతి అధ్యాపకుడు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ ఆదేశించారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణిత శాస్త్రము, పౌరశాస్త్రంకు సంబంధించిన మూల్యాంకనం శుక్రవారం ప్రారంభమవుతుందని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మూల్యాంకన విధులు ఆర్డర్ వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, మైనారిటీ, కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తు ఇంటర్ బోర్డు ఆర్డర్ వచ్చిన అధ్యాపకులు అందరూ రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఇంటర్మీడియట్ బోర్డ్ నిబంధనల ప్రకారము మూల్యాంకన విధులకు హాజరుకాని అధ్యాపకులపై చర్యలు తీసుకోవడానికి ఇంటర్ బోర్డు సిద్ధంగా ఉందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. గతంలో హాజరుకాని అధ్యాపకులకు అపరాధ రుసుము చెల్లించడంతోపాటు శాఖపరమైన చర్యలను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు.