రామ రాజ్యాన్ని తలపించేలా కేసిఆర్‌ పాలన

బాల్కొండ, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసిఆర్‌ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కేసిఆర్‌ సర్కార్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు,కుల వృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. పేదలు, రైతులు అంటే పరితపించే కేసిఆర్‌ నాయకత్వం యావత్‌ భారతావనికి శ్రీరామ రక్ష లాంటిదన్నారు.

రాముల వారి కళ్యాణంలో వేముల దంపతులు

శ్రీరామ నవమి పురస్కరించుకొని పోచంపాడ్‌ కోదండ రామాలయంలో రాములవారి కల్యాణోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి-నీరజా రెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి,వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోదండ రాముణ్ణి ప్రార్థించారు. కన్నుల పండువగా జరిగిన సీతారామ కల్యాణోత్సవం అనంతరం భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మంత్రి వేముల దంపతులు స్వయంగా భక్తులకు వడ్డించారు.

పోచంపాడ్‌ – సొన్‌ పేట్‌ బ్రిడ్జి శంకుస్థాపన

మెండోరా మండలం పోచంపాడ్‌ – సొన్‌ పెట్‌ గ్రామాల మద్య కాకతీయ కెనాల్‌ పై 1.30 కోట్లతో నిర్మించే నూతన బ్రిడ్జ్‌ నిర్మాణ పనులకు గురువారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేసిఆర్‌ కృషి వల్ల ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ కాలువ 365 రోజులు నిండుగా ఉంటుందని అందుకే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అయ్యిందన్నారు.

ఇటీవల వర్షాలకు పాత బ్రిడ్జ్‌ రిపేర్‌ అయ్యిందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారికి దృష్టికి తీసుకువెళ్లి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. మొదట కోటి రూపాయలు అవుతుందని అంచనా వేస్తే ఏడాది పొడవునా నీరు ఉంటుండంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదని, ఆర్‌ అండ్‌ బి శాఖ కొత్త టెక్నాలజీతో బ్రిడ్జి నిర్మిస్తుందని అందుకు 25 నుంచి 30 లక్షల కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నాయని వెల్లడిరచారు.

ఈ ప్రాంత ప్రజల పక్షాన అడగ్గానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ 1కోటి 30 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. పోచంపాడ్‌, సొన్‌ పేట్‌ ప్రజల తరుపున కేసిఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే బ్రిడ్జి అందుబాటులోకి రానుందని మంత్రి అన్నారు.

నాడు శివాలయాలుగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేడు వైష్ణవ ఆలయాలుగా…

పోచంపాడ్‌ శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ పై 25 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. లిఫ్ట్‌ వలన అధికారులకు ప్రాజెక్టు కింది బాగాన ఉన్న వరద గేట్ల ను పరిశీలించడానికి మరియు ఇతర పనులకు అనువుగా మారనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు శివాలయలుగా ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌ లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో వైష్ణవాలయలుగా మారాయి అన్నారు.

పోచంపాడ్‌ ప్రాజెక్ట్‌ పై రోడ్లు, రిటైనింగ్‌ వాల్‌,వరద గేట్ల మరమ్మతులు, ఇతర పనుల కోసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో సుమారు 40 కోట్ల వరకు ఖర్చు చేశామని మంత్రి అన్నారు. కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »