ఆలూరు, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైత్ర శుద్ధ నవమి రోజున ఆలూర్ గ్రామంలో శ్రీరాముని యొక్క జననం నిర్వహిస్తారు. పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో శ్రీరామ చంద్రుని కళ్యాణం జరిపితే ఆలూర్ రామాలయంలో శ్రీరాముని జననం జరుపుతారన్నారు.
ఈ ఆలయానికి విశిష్టతగా పూర్వం నుండి శ్రీరామనవమి రోజున రాముడి యొక్క జననం నిర్వహించడం ప్రత్యేకత. శ్రీరాముని ఉయ్యాలలో వేసి జోల పాటలు పాడుతూ ఉపచారం చేయడం జరుగుతుందని, ప్రతి ఆలయం కంటే కూడా ఇక్కడున్న మూలరాముడికి అంటే పూర్వం నుండి వచ్చిన శ్రీరాముడికి మీసాలు ఉండటం విశిష్టత పట్టాభిరాముడుగా కొలుస్తారన్నారు.
రామాలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తీర్థప్రసాదాలు తీసుకుంటూ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా శ్రీరాముని పూజిస్తారు. వాగడ్డ హనుమాన్ మందిరం నుండి రాములవారి గుడి వద్దకు అంజన్న స్వాములు నైవేద్యం ప్రసాదాలు ఊరేగింపుగా తీసుకువచ్చి రాములవారిని పూజించారు. వీడీసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలూర్ అంజన్న స్వాములు, వీడిసి అధ్యక్షులు బార్ల గణపతి, గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్, టిఆర్‌ఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్, సంజీవ్, సాయిరెడ్డి, గిరీష్, ఎడ్ల నడిపన్న, శ్రీకాంత్, మంతెన నారాయణ, నరేందర్, రాజు, గంగారెడ్డి, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.