నిజామాబాద్, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 15 నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు . జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్తు, పోస్టల్, పాఠశాల విద్యాశాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ పుష్పగుచ్చం అందించారు. ఇంటర్ బోర్డు నియమ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా ఇంటర్ విద్యార్థి కృతజ్ఞతలు తెలియజేశారు.