Daily Archives: March 31, 2023

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్‌. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. మే …

Read More »

8న హెచ్‌సిఎల్‌ కంపెనీ సెలక్షన్‌ డ్రైవ్‌

కామరెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 8 న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్సిఎల్‌ కంపెనీ సెలక్షన్‌ డ్రైవ్‌ కు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం టెక్‌ బి – హెచ్‌ సి ఎల్‌ ఎర్లీ కెరీర్‌ ఫోర్‌ గ్రామ్‌ పై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్లతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. …

Read More »

ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్ర పహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దేమి కాలన్‌ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా …

Read More »

మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సనత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని మెడికల్‌ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డిఎంహెచ్‌ఓ, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ …

Read More »

రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

మాచారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి రెవెన్యూ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. ధరణిలో పెండిరగ్‌లో ఉన్న ఫైల్స్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్‌ సునీత, డిప్యూటీ తహసిల్దార్‌ బాలరాజు పాల్గొన్నారు.

Read More »

అంటరానితనం పాటిస్తే చట్టప్రకారం చర్యలు

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్‌ లో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలవడం కోసం పోటీపడి చదువుకోవాలని తెలిపారు. సాంఘిక అసమానతలను రూపుమాపాలని కోరారు. సర్పంచ్‌ మమత, ఎస్సై సంతోష్‌ కుమార్‌, …

Read More »

ఐఎన్‌టిఎస్‌ఓ పరీక్షల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాజాగా ప్రకటించిన ఐఎన్‌టిఎస్‌ఓ (ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలంపియాడ్‌) జాతీయ పరీక్ష ఫైనల్‌ ఫలితాలలో శ్రీ చైతన్య కామారెడ్డి బ్రాంచ్‌కు చెందిన 80 మంది విద్యార్థులు సత్తా చాటి వారి ప్రతిభను నిరూపించుకున్నారని కామారెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కే స్వర్ణలత అన్నారు. వీరిలో ఆరవ తరగతికి చెందిన ఏ కమల్‌ నాయుడుకు రెండవ బహుమతి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »