కామరెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 8 న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్సిఎల్ కంపెనీ సెలక్షన్ డ్రైవ్ కు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం టెక్ బి – హెచ్ సి ఎల్ ఎర్లీ కెరీర్ ఫోర్ గ్రామ్ పై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకొని ఉపాధి కోరుకునే వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు. 2022, 2023 ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై 60 ఓవరాల్, 60 శాతం గణితంలో మార్కులు పొందిన వారికి అర్హత ఉంటుందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్ అనలిస్ట్, డిజైన్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సపోర్ట్ అండ్ ప్రాసెస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. టెక్ బి ఫోర్ గ్రామ్‌లో చేరిన విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్సి ఎల్ కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా నియామకం ఉంటుందని చెప్పారు.
ప్రోగ్రాంలో భాగంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఇంటర్నేషిష్ ఉంటుందన్నారు. నెలకు పదివేల రూపాయల స్టయిఫండ్ ఇస్తారని పేర్కొన్నారు. ఫోర్ గ్రామ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ.2.2 లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుందని తెలిపారు. అనంతరం బిట్స్ పిలాని, శాస్త్ర ఆమెటి, కేఎల్ యూనివర్సిటీ అందించే గ్రాడ్యుయేషన్ ఫోర్ గ్రామ్ ను చేసుకొనే వీలుందని చెప్పారు. ఈ టెక్ బి ఒక సంవత్సరం శిక్షణ కయ్యే రూ.1.18 లక్షల రుసుమును ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా చెల్లించే వెసులుబాటు హెచ్సీఎల్ కంపెనీ కల్పిస్తుందన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు http://bit.ly/HCLTB-Telangana లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.