ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్‌, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్‌. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. మే 7న నీట్‌ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్‌ పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »