కామారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ లో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సమాజంలో ఉన్నత స్థానంలో నిలవడం కోసం పోటీపడి చదువుకోవాలని తెలిపారు. సాంఘిక అసమానతలను రూపుమాపాలని కోరారు. సర్పంచ్ మమత, ఎస్సై సంతోష్ కుమార్, తాసిల్దార్ సునీత, ఎంపిటిసి సభ్యురాలు లత, వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.