మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సనత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని మెడికల్‌ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డిఎంహెచ్‌ఓ, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎంబిబిఎస్‌ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో తరచూ ఇలాంటి సంఘటనలు జరగడం విస్మయానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన అధ్యాపక బృందం ప్రిన్సిపాల్‌ విద్యార్థులతో మానసిక వికాస శిక్షణ తరగతులను పెట్టాలని విద్యార్థులకు ధైర్యాన్ని నింపాలని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఎర్రం సుధీర్‌, జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్‌, దాత్రికా రమేష్‌, సాయి, మేదరి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »