Monthly Archives: March 2023

వడ్యాట్‌లో పోషణ పక్షం అవగాహన సదస్సు

మోర్తాడ్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండలం వడ్యాట్‌ గ్రామంలో బుధవారం రెండు అంగన్‌వాడి సెంటర్లలో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు, కిశోర బాలికలకు మిల్లెట్స్‌ ఎనిమియా, చిరుధాన్యాల విషయమై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్లు కవిత, శోభ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపిపి

రామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతుందా?, ప్రామాణికత పాటిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. హాస్టల్లోని ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు …

Read More »

ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ శివారులోని పాండు తర్ప వద్ద ప్రజాపయోగ అవసరాల నిమిత్తం ఇదివరకు ప్రభుత్వం సేకరించిన భూములను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ భూములకు సంబంధించిన వివరాల గురించి బోధన్‌ ఆర్డీఓ రాజేశ్వర్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. 67 ఎకరాల భూమిని ప్రభుత్వపరంగా సేకరించడం జరిగిందని తెలిపారు. రెండు పడక గదుల …

Read More »

సైబర్‌ నేరాల పట్ల తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి

బాన్సువాడ, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ నేరాలు జరగకుండా సైబర్‌ మోసగాల వలలో పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులకు ఎంతో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్‌ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్‌ కాల్స్‌ స్వీకరించకుండా, తమకు ఏమైనా …

Read More »

పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి ఈరోజు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, బీడీ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ …

Read More »

సిఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పే స్కేల్‌ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్‌ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కి, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. సెర్ప్‌ ఉద్యోగస్తుల చిరకాల కల నెరవేరిందని, 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న …

Read More »

అన్ని విధాలా మోర్తాడ్‌ మండల కేంద్రం అభివృద్ది

మోర్తాడ్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసిఆర్‌ దయ వల్ల బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేశామో..అదే ప్రాంతంలో సెంట్రల్‌ లైటింగ్‌ స్విచ్‌ ఆన్‌ చేసి …

Read More »

కంటి వెలుగు శిబిరం తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుర్ల గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

సిరి ధాన్యాల ఆవశ్యకత పై విస్తృత ప్రచారం నిర్వహించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషక లోపాలను నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సిరి ధాన్యాల వినియోగం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పోషణ్‌ పక్వాడ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇందులో …

Read More »

కేసిఆర్‌ వల్ల ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నయి

మోర్తాడ్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వేల్పూర్‌ ప్రయాణంలో అమీనాపూర్‌ వద్ద గుత్ప,నవాబ్‌ లిఫ్ట్‌ ల ద్వారా చెరువులు నింపడానికి కెనాల్‌ ద్వారా నీరు విడుదల కొనసాగుతుండటంతో… ఆగి కాలువలో పారుతున్న నీటిని చూసి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంబురపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో ద్వారా ప్రజలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »