కామారెడ్డి, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు విస్తరించాలని ఎస్‌బిఐ ఏటీఎం విజయ్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డిలోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ టి శ్రీనివాస్ వీడ్కోలు సమావేశానికి హాజరై మాట్లాడారు. బ్యాంకింగ్‌లో 39 సంవత్సరాలుగా సేవలు చేసి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు.
అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ మేనేజర్‌గా శ్రీనివాస్ చేసిన సేవలను వివరించారు. రిటైర్డ్ అవుతున్న మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకులో సిబ్బంది అందరూ తనకు సహకరించారని తెలిపారు. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన మేనేజర్లు సిబ్బంది మాట్లాడారు. అనంతరం టి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు.