నిజామాబాద్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్, టిఎస్ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి చెక్కుల విలువ రూ . 13 లక్షల 71 వేలు లబ్ధిదారులకు శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్ చేతుల మీదగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కన్నేరాం లత, జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు మధుకర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.