బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్‌ కుమార్‌

భీంగల్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోల్ల సుమన్‌ ఇటీవల తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. సుమన్‌ 5 సంవత్సరాల క్రితం గల్ఫ్‌ వెళ్ళి పని దొరకక నష్టపోయి తిరిగి వచ్చి ఉన్న కొన్ని గొర్రెలను మేపుకొని జీవితం గడిపి కుటుంబాన్ని పోషించాడు. అప్పులు ఎక్కువ కావడంతో గొర్రెలను అమ్మేసి ఊరిలోనే వేరొకరి దగ్గర గొర్ల కాపరిగా జీతం ఉన్నాడు. విధి వక్రీకరించి కిడ్ని వ్యాధితో అతను మరణించాడు.

విషయాన్ని తెలుసుకున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌ కుమార్‌ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుమన్‌కు భార్య మంజుల, ఇద్దరు కూతుర్లు శ్రీనిధి, కీర్తన ఉన్నారు. ముత్యాల సునీల్‌ కుమార్‌ వీరికి ధైర్యాన్ని కల్పించి వారి చదువుల కోసం 25 వేల రూపాయలు డిపాజిట్‌ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సునీల్‌ సేన సభ్యులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »