రెంజల్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం) లో అనాధ, పేద విద్యార్థులకు పరీక్ష అట్టలు, నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, కంపాక్స్ బాక్సులను స్థానిక సర్పంచ్ ఖలీంబేగ్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు.
గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ముఖీంబేగ్ తన సొంత ఖర్చులతో పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు పేద విద్యార్థులను గుర్తించి 25 మంది విద్యార్థులకు పైన పేర్కొన్న సామాగ్రిని అందించారు. అనంతరం పదవతరగతి విద్యార్థులకు సర్పంచ్ చేతుల మీదుగా హాల్ టికెట్లను అందించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ కరీం ఉన్నారు.