వసతి గృహాన్ని తనిఖీ చేసిన వైస్‌ చాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ని శనివారం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాయ్స్‌ హాస్టల్‌లోని వంటశాల, స్టోర్‌ రూమ్‌, విద్యార్థుల గదులను పరిశీలిస్తూ కలియతిరిగారు. వంటశాలలో అపరిశుభ్రత ఉండటంపై వైస్‌ ఛాన్స్‌లర్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డైనింగ్‌ హాల్‌లో మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అక్కడే భోజనం చేస్తున్న విద్యార్థులను భోజనం అందుతున్న స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన మెనూ పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌కు సూచించారు. మన ఇండ్లలో వంట చేసుకునే విధంగానే హాస్టల్‌ భోజనం రుచి కరంగా వండాలని వంటచేసేసిబ్బందికి ఆదేశించారు.

స్టోర్‌ రూమ్‌లో బియ్యం ఇతర వస్తువులను శుభ్రంగా భద్రపరుస్తూ విద్యార్థులకు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా హాస్టల్‌ సిబ్బంది, వంట మనుషులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు సేవలందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల కోరిక మేరకు వైస్‌ చాన్స్‌లర్‌, హాస్టల్లో నూతన టీవీని ఏర్పాటు చేయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌కు పలు సమస్యలు తెలిపారు. ముఖ్యంగా హాస్టల్‌ భవనంకు పెయింట్‌ వేయించాలని కోరగా స్పందించిన వీసీ త్వరలోనే పెయింటింగ్‌ వేయించేలా చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట డైరెక్టర్‌, పిఆర్‌వో డాక్టర్‌ జమీల్‌ అహ్మద్‌, అసిస్టెంట్‌ వార్డెన్‌ డాక్టర్‌ కిరణ్‌ రాథోడ్‌, కేర్‌ టేకర్‌ చౌహన్‌, విద్యార్థి సంఘ నాయకులు శివ, సంతోష్‌, ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ విద్యార్థులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »