రెంజల్, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా జల్ద శ్రీనివాస్,లోల గంగాధర్,ఉపాధ్యక్షుడిగా దేవిదాస్, సహాయకార్యదర్శిగా స్వామి,కోశాధికారిగా మోహన్ లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యతకు కృషి చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వపరంగా పద్మశాలీల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడతామని వారన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రమేష్, గంగా ప్రసాద్, సతీష్, రాము, గణపతి, తదితరులు పాల్గొన్నారు.