ఆర్మూర్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు నిర్వహించవలసిన బాధ్యతలను వివరించారు. హోప్ హాస్పిటల్ డాక్టర్ అనుకోకుండా రోడ్డుపై వెళ్లే వ్యక్తికి హార్ట్ ఎటాక్ ఏ విధంగా సేవ్ చేయాలో వివరించారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తి సడన్‌గా పడిపోతే సిపిఆర్ ద్వారా మనిషిని బ్రతికించవచ్చని ఆ సమయంలో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి హాస్పిటల్‌లో చేరిస్తే బ్రతికే అవకాశం ఉంటుందని సిపిఆర్ ఎలా చేయాలో అంగన్వాడి టీచర్లకు ప్రత్యక్షంగా చూపించారు.
అలాగే మనం తినే ఆహారం మితమంగా ఉండాలని మితిమీరి తినకూడదని నాన్ వెజ్ పూర్తిగా తినవద్దని దీని ద్వారా మన శరీరంలో పొట్టలో కొవ్వు పేరుకుపోయి పొట్ట ఉబ్బడం అధిక బరువు పెరగడం ఇలాంటివి గుండెపోటుకు దారితీస్తాయని అలాగే బిపి షుగర్ రోగాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని వివరించారు మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్, మాట్లాడుతూ మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలని ప్రతిరోజు యోగ ఎక్ససైజ్ చేయాలని ఆహారం తినగానే పడుకోకూడదని, రోజుకు ఐదు లీటర్ల నీటిని త్రాగాలని టీచర్లకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.
పోషణ పక్షంలో భాగంగా ఆర్మూర్ ప్రాజెక్టులో నిర్వహించడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. టీచర్లు తీసుకువచ్చిన పోషక ఆహార వంటలను పరిశీలించారు. బాగున్నాయని తెలిపారు. అనంతరం ప్రశంస పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్, సిడిపిఓ, ఎసిడిపిఓ, సూపర్వైజర్లు డాక్టర్లు, అంగన్వాడి టీచర్లు ఆయాలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.