డిచ్‌పల్లి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు తెలంగాణ యూనివర్సిటీ సిఓఈ ప్రొఫెసర్ అరుణ సోమవారం తెలిపారు.
5వ సెమిస్టర్ పరీక్షల్లో 9 వేల 638 విద్యార్థులు పరీక్ష రాయగా 3 వేల 788 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 2 వేల 869 మంది బాలికలు ఉత్తీర్ణత పొందగా, 919 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ పరీక్షల్లో 3 వేల 156 మంది బాలురు ప్రమోట్ కాగా 2 వేల 694 మంది బాలికలు ప్రమోట్ అయ్యారని అన్నారు.
మొత్తం 39.30 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. 3వ సెమిస్టర్ పరీక్షల్లో 10 వేల 697 పరీక్షలకు హాజరు కాగా 3 వేల 375 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని 2 వేల 696 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా 679 బాలురు ఉత్తీర్ణత పొందరని, 4 వేల 54 బాలురు ప్రమోట్ అయ్యారని, 3 వేల 268 బాలికలు ప్రమోటెడ్ పొందారని పేర్కొన్నారు. మొత్తం 31.55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆచార్య అరుణ పేర్కొన్నారు.
పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్ సైట్ సంప్రదించాలని కోరారు.