కామారెడ్డి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జై గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాంగోళ్ల మురళి గౌడ్ అన్నారు. తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 313 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటను ఏలిన మహావీరుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బురాన సంగమేశ్వర్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, ముఖేష్ గౌడ్, ఐలాపురం విష్ణు గౌడ్, బాల్ నర్సాగౌడ్, ప్రశాంత్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.