కామరెడ్డి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బిఆర్‌ఎస్ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి, అలాగే మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి బీఆర్‌ఎస్ నాయకులు నివాళులర్పించారు.
దొడ్డి కొమురయ్య, శివాజీ ఆశయాలను బిఆర్‌ఎస్ పార్టీ ముందుకు తీసుకెళుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషదగ్గ విషయమని అన్నారు. రాబోవు రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీ శివాజీ, దొడ్డి కొమరయ్య కలలుగన్న సమాసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు భూమేష్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు సంగమేశ్వర్, రాజలింగం, శ్రీనివాస్, చరణ్, సాయి, దినేష్ రెడ్డి, హనీఫ్, కృష్ణ, గఫార్, భరత్, అశ్వక్, శ్రీనివాస్ రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.