రెంజల్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన ఉన్నపురం సాయిలు(27)అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బోధన్‌లోని రాకాసి పేటకు చెందిన ప్రియాంకతో ఆరు సంవత్సరాల క్రితం సాయిలుకు వివాహం జరిగిందని వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. భార్యాభర్తలు మనస్పర్ధలు రావడంతో భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపం చెందిన సాయిలు ఈనెల 3వ తేదీన ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును గమనించిన తండ్రి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని చికిత్స పొందుతూ గురువారం మృతి చెందడని ఎస్ఐ తెలిపారు.
మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.