రెంజల్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జడ్పిటిసి మేక విజయ సంతోష్ అన్నారు. శుక్రవారం మండలంలోని రెంజల్, తాడ్బిలోలి, బోర్గం, నీలా, కందకుర్తి, దూపల్లి, వీరన్నగుట్ట, కళ్యాపూర్, దండిగుట్ట గ్రామాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ మేక విజయ సంతోష్ మాట్లాడుతూ. .కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటుందని తమ పార్టీ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు మళ్లీ బీజేపీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జీవన భృతి,రైతులకు ఏకకాలంలో రుణమాఫీ,అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రుక్మిణి,ప్రతాప్ రెడ్డి, ప్రసాద్ నాగోజీ, రూపేష్, నాగనాథ్ పటేల్, విజయ్ యాదవ్, నర్సారెడ్డి, మోహన్, ఐలన్న, పార్ధ రమేష్, తదితరులు ఉన్నారు.