త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్‌ 14న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్‌ జయంతి వేడుకలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడారు. ఏప్రిల్‌ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లో నిర్మించిన 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, దీనిని విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యెలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 బస్సులతో ప్రజలను తరలించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల కేంద్రం నుంచి బస్సులు నడపాలని సీఎస్‌ తెలిపారు.

అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి తప్పనిసరిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్‌ కు ప్రజలు చేరుకునే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు ఆ రోజు టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ ఏర్పాట్లు చేయాలని, ప్రతి బస్సులో పోలీస్‌ అధికారి, ప్రభుత్వ అధికారినీ నియమించి బాధ్యతలు అప్పగించాలని, బస్సు తిరిగి మండల కేంద్రాలకు చేరే వరకు జిల్లా స్థాయిలో మానిటరింగ్‌ చేయాలని సీఎస్‌ పేర్కొన్నారు.

రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభిస్తారని, దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు జిల్లాలో పూర్తి చేయాలని సీఎస్‌ తెలిపారు. రెండవ విడత క్రింద ఎంపిక చేసిన 3.38 లక్షల లబ్దిదారులలో మరణించిన వారి నామిని వివరాలు సేకరించి వారికి గొర్రెల యునిట్లను పంపిణి చేయాలని అన్నారు.

ప్రతి మండల పరిధిలోని లబ్దిదారులతో రెండవ విడత గొర్రెల పంపిణీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్దిదారున్ని వాటా సేకరించాలని, గొర్రెల కోనుగోలు కోసం వెళ్ళెందుకు సినియర్‌ అధికారినీ నియ మించాలని కలెక్టర్లకు సీఎస్‌ తెలిపారు.

లివీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు వెంకటేష్‌ దోత్రే మాట్లాడారు. గొర్రెల పంపిణీ, అంబేద్కర్‌ జయంతి పై పలు సూచనలు చేశారు. జిల్లాలో గొర్రెల పంపిణీ రెండవ విడత సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా పశు సంవర్ధక అధికారులకు సూచించారు.

అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజల తరలింపు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పాల్గోనే ప్రజల వివరాలు సేకరించాలని, ప్రతి మండల పరిధిలో వెళ్ళె బస్సులో అవసరమైన స్నాక్స్‌, వాటర్‌ బాటిల్‌, బ్రేక్‌ ఫాస్ట్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రతి మండల కేంద్రం నుండి ఉదయం 8గంటల వరకు బస్సులు హైదరాబాద్‌ కు బయలు దేరే లా చర్యలు తీసుకోవాలని, ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జనరల్‌ అడ్మినిస్త్రేషన్‌ నుండి ఇద్దరు, పోలీస్‌ శాఖ నుండి ఒక్కరూ ఉండేలా చూసుకోవాలన్నారు.

దృశ్య మాధ్యమ సమీక్షకు జిల్లా కలెక్టరెట్‌ నుంచి సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్టీవో వాణి, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో సాయగౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి దయానంద్‌, రావు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »