కామారెడ్డి, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో జల సంరక్షణ పనులు చేపట్టే విధంగా చూడాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టే విధంగా ఉటచెరువులు, కంటూర్ కందకాలు, ఇంకుడు గుంతలు, ఫిష్ ఫండ్ నిర్మాణం వంటి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్డిఓ సాయన్న, అధికారులు పాల్గొన్నారు.