కామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కె9 విలేఖరి ప్రవీణ్ రెడ్డి తన జన్మదినం మరియు పెళ్లి రోజును పురస్కరించుకొని శనివారం రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవా దళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడమే కాకుండా రక్తదానం చేసే రక్త దాతలకు గుండెపోటు,క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా ఉండడం జరుగుతుందని, మే 4వ తేదీన ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన పురస్కరించుకొని తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
వేసవి కాలం కావడం వలన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన రక్తం దొరకకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారి ప్రాణాలను కాపాడాలని మంచి సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని రక్తదానం చేయాలనుకున్న రక్తదాతలు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి సంప్రదించాలన్నారు. రక్తదానం చేసిన రక్తదాత ప్రవీణ్ రెడ్డి కి ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు జిల్లా కలెక్టర్ ఐఆర్సిఎస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు ఏసు గౌడ్, చందన్ పాల్గొన్నారు.