రామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాడి రైతులకు ప్రోత్సాహాకంగా లీటరుకు ఏడు రూపాయల 10 పైసలు, ఆవు పాలు నాలుగు రూపాయల 60 పైసలు పాడి పరిశ్రమను పెంచాలని సదుద్దేశంతో పాడి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించడం జరిగింది.
అందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు సురేందర్ ఆదేశానుసారం రామారెడ్డి మండల ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోసానిపేట గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుతార నరేష్, గ్రామ రైతు బంధు అధ్యక్షులు సిఎస్ తిరుపతి, పాల కేంద్రం అధ్యక్షులు బలగం వెంకట్ రాములు, వీడీసీ అధ్యక్షులు సుద్దాల లింగం, కో ఆప్షన్ నెంబర్ పోతుల చిన్న బాబు రెడ్డి, పాలకేంద్రం డైరెక్టర్ టంకరి లింగం, కొటాల గంగారెడ్డి, రైతుబంధు డైరెక్టర్లు కోటాలపల్లి లక్ష్మణ్, పాలకేంద్రం డైరెక్టర్లు మరియు పాడి రైతులు గ్రామ పెద్దలు బుచ్చి బాలయ్య, సాకలి నారాయణ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.