నిజామాబాద్‌కు 29మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు వివిధ డిపార్ట్మెంట్లలో సేవలు అందించనున్నారని మంత్రి తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో నియామకం కానున్నందున పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాణ్యమైన వైద్యం కోసం మహా నగరాలకు పోయే రోజుల నుండి ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాలతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సేవలు రావడం వల్ల ప్రజలకు మంచి వైద్యం దొరకనుందని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజ్‌ తీసుకురావడమే లక్ష్యంగా సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 17 మెడికల్‌ కాలేజీలు ఉండగా నూతనంగా మరో 9మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించనుందని వివరించారు. వీటి వల్ల ప్రజలకు వైద్యంతో పాటు నూతనంగా విద్యార్థులకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీని ద్వారా వైద్యంతో పాటు సామాన్య విద్యార్థులకు వైద్య విద్య అందుతుందని, ఇది కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందన్నారు.

దేశానికి తెలంగాణ ఆరోగ్య రంగంలో మోడల్‌గా నిలిచిందని, అంతేకాకుండా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపైన నమ్మకం గణనీయంగా పెరిగిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »