కామారెడ్డి, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్ మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
సమాజంలో డబ్బుతో కొనలేని అత్యంత విలువైనది కేవలం రక్తం మాత్రమే,అలాంటి రక్తం కేవలం మంచి మనసున్న రక్తదాతలు ముందుకు వచ్చినప్పుడే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుందని అన్నారు. రక్తదాత శ్రావణ్ కుమార్ కి ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు.
నేటి సమాజంలో యువతీ యువకులు సామాజిక సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని, రక్తదానం చేయాలనుకునే వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి పంపించాలన్నారు. కార్యక్రమంలో వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రం టెక్నీషియన్లు చందన్, ఏసుగౌడ్ పాల్గొన్నారు.