కామారెడ్డి, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం గర్గుల్ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా స్థాయి ఎన్నికలు చేపట్టారు. ఎన్నికల అధికారులు పిట్లం అనుమాండ్లు ఆచార్యులు, నాగభూషణమాచారి, దేవిప్రసాదచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
జిల్లా సంఘ అధ్యక్షులుగా శిర్లవంచ కృష్ణమా చార్యులు, ఉపాధ్యక్షులు దేవర కొండ నరేష్ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి కొండ రామచెంద్రమాచారి, ఉప కార్యదర్శి కొత్త పల్లి దోఢోజు రాజాచార్యులు, కోశాధికారి అల్వాల శ్రీనివాస్ చారి, ప్రధాన సలహదారు ఆనంతోజు నాగభూషణం ఆచార్యులు, పోలోజు మురళి ఆచార్యులు, ముఖ్య సలహాదారులు కసాల లింగమాచారి మరియు గడ్డపు రాజేష్ చారిలను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికలు విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నిర్మాణానికి, ఎదుగుదలకు దోహదపడతాయని సంఘ అధ్యక్షులు అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినందున సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.