రెంజల్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెల 14న మండలంలోని సాటా పూర్ గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్ వికార్ పాషా తెలిపారు. సోమవారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్ వికార్ పాషా శాలువా, పులమాలలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ లత సాయిలు, వైద్యాధికారి ప్రమోదీత, కార్యదర్శి మహబూబ్ ఆలీ, కంఠం గంగారాం, భూమేష్, సాయిలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.