రెంజల్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులను వైఎస్ ఎంపీపీ క్యాతం యోగేష్ పరిశీలించారు. గ్రామంలోని చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను పరిశీలించి చేసిన పనులకు ఖచ్చితమైన కొలతతో కూడిన డబ్బులు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు సూచించారు.
ఎండలు ఎక్కువగా సమీపిస్తుండడంతో పని ప్రదేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు తాగునీటి సమస్యను లేకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాంచందర్,శివ కుమార్ తదితరులు ఉన్నారు.