రెంజల్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని విండో చైర్మన్ భూమరెడ్డి,సర్పంచ్ సాయరెడ్డి అన్నారు.సోమవారం దూపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రహించాలని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిలు, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, నీరడి రవికుమార్, సీఈవో జీవన్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.