రెంజల్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ఉన్న అసమాన తలను తొలగించేందుకు నిరంతరం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రయాణించి ఆయన ఆశలను కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళులని మండల పరిషత్ అధ్యక్షురాలు లోలపు రజనీకిషోర్ అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి ఎంపీడీవో శంకర్, సర్పంచ్ సునీత నర్సయ్య తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు జ్యోతిరావ్ పూలే సత్య శోదక్ అనే సంస్థను స్థాపించి అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడని,సమాజంలో ఉన్న మహిళలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన జ్యోతిరావు పూలే,తన భార్య సావిత్రి బాయి పూలే ద్వారా మహిళలకు విద్యాభ్యాసం కల్పించిన మహానియుడని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ చింతకుంట లక్ష్మీ లింగారెడ్డి, ఉపసర్పంచ్ మస్కుర్ లక్ష్మీ,రైతుబందు జిల్లా డైరెక్టర్ మౌలానా, రామాలయం అధ్యక్షకార్యదర్శులు లింగాల అబ్బన్న, మల్ల సాయిలు, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, కరోబర్ అనంత్ రావ్ తదితరులు ఉన్నారు.