రెంజల్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో శంకర్, సర్పంచ్ వెలమల సునీత నర్సయ్య తో కలిసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వియోగపరుచుకోవాలని అన్నారు.
ప్రతి ఒకరికి అవసరం మేరకు ఉచిత మందులతో పాటు గ్లాసులను అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ లింగారెడ్డి, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మౌలానా,ఉపసర్పంచ్ మస్కుర్ లక్ష్మీ,పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్,వార్డు సభ్యులు క్రాంతి కుమార్, నారాయణ రెడ్డి మమత,బిఆర్‌ఎస్ నాయకులు లింగాల అబ్బన్న, మల్ల సాయిలు, దత్తుపటేల్, అనంత్ రావ్, డీలర్ పార్వతి రాజేశ్వర్, ఆరోగ్య కార్యకర్త మంజుల, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు అరుణ, రాణి, ఆశా కార్యకర్తలు శైలజ, విజయ, పావని తదితరులున్నారు.