కామారెడ్డి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి ఐఎన్ టిఎస్ ఓ ఒలంపియాడ్ లెవల్- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు.
ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్ కన్సోలేషన్ బహుమతి, ఎస్ మనస్విని కన్సోలేషన్, బహుమతి పొందిన జి. గీతా దీపిక, పి. ఘనహాసిత్, కే.శ్రీనిత్య కన్సోలేషన్, కే హనుమాన్ చారి, వి. మనీష్ కుమార్, వై లాస్వితారెడ్డి, వి.భైరవ అఖిలేష్, డి రితేష్, వి. సద్గుణ, డి. విశ్వక్ రానా, బి. సాయి విశ్వేశ్, వి.అనిరుద్, కన్సోలేషన్ బహుమతి ఆర్. శశి ప్రీతం, డి. సోహన్, సయ్యద్ అక్సజకీర్, ఎన్. సంహిత రెడ్డి, ఏ అభిరామ్, గోల్డ్ మెడల్స్ 13 గెలుచుకున్నారని అన్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం శ్రీధర్, శ్రీవిద్య అభినందించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఆర్ ఐ.రాజు, ప్రిన్సిపాల్ కే స్వర్ణలత, అకాడమిక్ కోఆర్డినేటర్ నరేందర్, అకాడమిక్ డీన్ జి.సంపత్ కుమార్, ప్రైమరీ ఇన్చార్జ్ ఎం. హేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.