కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాలు విరిగి భాధపడుతున్న రాములు అనే వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు.
రామరెడ్డి మండల బీజేవైయం అధ్యక్షుడు ఈసాయిపేట్ నరేష్ సహకారంతో వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా రక్తదాతను జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ అభినందించారు. ఎవరికైనా రక్తం అవసరం ఉంటే 9666620006, 9848687025 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధి మ్యాన రంజిత్, రవీందర్ రావు, వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియాన్ చందన్, యేసుగౌడ్ పాల్గొన్నారు.