కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా మంగళవారం 31 మందికి 22 లక్షల 76 వేల 600 వందల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో 1868 మందికి 11 కోట్ల 41 లక్షల 76 వేల 2 వందల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఇక ముందు కూడా నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మీరు ఆసుపత్రిలో చుపించుకున్న పత్రాలను కార్యాలయంలో అందజేయాలని ప్రభుత్వ విప్ తెలిపారు.