రెంజల్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.బుధవారం రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్,విండో చైర్మన్ మోహినోద్దీన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుకాలం కష్టపడి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2040 రూపాయలను అందిస్తుందని ఈ సదవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రహించి లాభాలను ఆర్జించాలని అన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేష్ కుమార్, బైండ్ల రాజు, రైతుబందు జిల్లా డైరెక్టర్ మౌలానా, సీఈఓ రాము, మాజీ ఛైర్మన్ అసాని ప్రశాంత్, డైరెక్టర్‌లు సుధాకర్, అగ్గు నారాయణ, సాయరెడ్డి, చంద్రకళ, సిబ్బంది శ్రీనివాస్, కిషోర్ తదితరులు ఉన్నారు.