ఆలూరు, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూర్, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్ కళ్లెం భోజరెడ్డి, తహసిల్దార్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2040 చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని అలాగే రైస్ మిల్ వారు కడ్తలు లేకుండా రైతులకు నష్టం కలిగించకుండా కొనాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోతె భోజకళ చిన్న రెడ్డి, సర్పంచ్‌లు కళ్లెం మోహన్ రెడ్డి, గడ్డం సరోజ గంగారెడ్డి, ఎంపీటీసీలు ఉప్పు అనూష శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి మల్లేష్, డైరెక్టర్లు కళ్లెం సాయ రెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, ఇంగు గోవర్ధన్, సింగిడి మల్లుబాయి, అరె రాజేశ్వర్, దూదిగాం ప్రమోద్, వీడీసీ సభ్యులు, సంఘం సీఈఓ మల్లేష్, సిబ్బంది ముత్యం, దేవరాజు, గంగాధర్, రాజు, వీఆర్‌ఏ సంపత్ గంగారాం రైతులు పాల్గొన్నారు.