మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది

కామరెడ్డి, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని హసన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం రాత్రి మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దిన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు.

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేసిందని చెప్పారు. మతాలకు అతీతంగా పండగను ఐక్యమత్యంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఇఫ్తార్‌ విందులో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందూ ప్రియ, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »