నిజామాబాద్, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాల్ని స్థానిక నిజామాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్లో సోమవారం నిర్వహించారు. మేయర్ దండు నీతుకిరణ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పిఓడిటి ఆఫీసు నుండి ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగిన తర్వాత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ర్యాలీలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, తిరుమల నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఆశా కార్యకర్తలు, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్, స్టేట్ టీబి ఆఫీసర్ డాక్టర్ రాజేశం, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ ఘన, రాష్ట్ర సమాచార ప్రచార విభాగం చైర్మన్ జితేందర్, టెక్నికల్ ఆఫీసర్ వాసు ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజేశం మాట్లాడుతూ, నూతన క్షయ వ్యాధిగ్రస్తులను 60 శాతం వరకు నిర్మూలించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకి జాతీయ స్థాయిలో బంగారు పతకం అవార్డు రావడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చాలని, దానికోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా లో 60 శాతం నూతన టీబీ వ్యాధిగ్రస్తులని తగ్గించడం వలన లిబంగారు పతకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాండవీయంల చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకోవడం జరిగిందన్నారు.లి జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా నిరంతరం పనిచేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా భవిష్యత్తులో నిజాంబాద్ జిల్లాలో 100 శాతం నూతన కేసులు నమోదు కాకుండా క్షయ రహిత జిల్లాగా నిజామాబాద్‌ని మారుస్తామని తెలిపారు.
ఇందులో భాగస్వాములైన క్షయ నియంత్రణ విభాగ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, రెడ్ క్రాస్, సూర్య హెల్త్ ఆర్గనైజేషన్, ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సూర్య హెల్త్ స్వచ్ఛంద సేవా సంస్థ రాజేందర్, సూర్య భగవాన్ ఆధ్వర్యంలో 50 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పీ.హిచ్.సీల సిబ్బందిని సత్కరించారు.
గత మూడు సంవత్సరాల నుండి 2020లో కాంస్య పతకం, 2021లో వెండి పతకం, మరియు 2022లో బంగారు పతకం నిజాంబాద్ జిల్లాకు జాతీయస్థాయిలో రావడం ద్వారా హ్యాట్రిక్ సాధించడంతో ఆర్‌ఎన్టిసిపి విభాగం సిబ్బంది, ముఖ్యంగా ఎస్‌టిఎస్, ఎస్‌టిఎల్‌ఎస్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బందిని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ మెమెంటో, ప్రశంసా పత్రాలతో సన్మానించారు.
అదేవిధంగా టీబీ వ్యాధికి గురై టీబీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి టీబి చాంపియన్స్‌గా మారిన వారిని కూడా ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఓలు రమేష్, విద్య, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ నీలి రామచందర్, ప్రొఫెసర్ డాక్టర్ విశాల్, డాక్టర్ డిఎల్‌ఎన్ స్వామి, పిఓడిటి డాక్టర్ నాగరాజ్, డిఐఓ డాక్టర్ అశోక్, డిస్టిక్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ రాజేష్, పల్మనాలజిస్టు డాక్టర్ రాజేశ్వర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ రూరల్ శ్రీలత, జిల్లా టిబి సమన్వయకర్త రవి గౌడ్, డిహెచ్‌ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.