రెంజల్, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజినీ కిషోర్, జెడ్పిటిసి విజయసంతోష్ అన్నారు.సోమవారం రెంజల్ మండల కేంద్రంతోపాటు, బాగేపల్లి,దండిగుట్ట, అంబేద్కర్ నగర్,బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, స్థానిక సర్పంచ్‌లతో వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రహించాలని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడు ధాన్యానికి రూ.2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2040 రూపాయలను ద్వారా కొనుగోలు చేస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, సర్పంచ్‌లు రమేష్ కుమార్, సాయిలు, శ్రీదేవి, కిష్టయ్య, మతురాబాయి, వాణి, సాయరెడ్డి, ఏపీఎం చిన్నయ్య, సీసీలు రాజయ్య, భాస్కర్, శ్యామల, కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.