కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు పద్మావతి (72) కి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో స్పందించి 30వ సారి రక్తాన్ని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా 2 యూనిట్ల ప్లాస్మాను రక్తదాత నక్షత్ర వైద్యశాల డైరెక్టర్ కాశెట్టి ఆంజనేయులు అందజేయడం జరిగిందని.ప్రతి 03 నెలలకు ఓసారి రక్తదానం చేస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు రక్తదాతకు ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు సంతోష్ జీవన్, వెంకట్ పాల్గొన్నారు.