రెంజల్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు షాదీ ముబారక్ చెక్కులను సొసైటీ చైర్మన్ ఇమామ్ బేగ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా షాదీ ముబారక్ ద్వారా చేయుతనందిస్తుందని ఆడపిల్లకు అన్నగా కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటూ షాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆయన అన్నారు.
షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, కారోబార్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.